'రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు'
JGL: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ చిలుముల లావణ్య అన్నారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అన్నారు.