VIDEO: పెరిగిన చలి తీవ్రత.. వాహనదారులకు ఇబ్బందులు
మహబూబాబాద్ జిల్లాలో పొగమంచు కురుస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. మంగళవారం ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూరం స్పష్టంగా కనిపించకపోవడంతో రహదారులపై వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. పోలీసులు, అధికారులు వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.