వివిధ రకాల పుష్పాల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం

ATP: గుంతకల్లు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలలో భాగంగా మూడో రోజు శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో 108 మంది దంపతులతో అమ్మవారికి పుష్పార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తికి వేకువజామున పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.