ఇరాన్ ఖర్గ్ ద్వీపం స్వాధీనానికి ట్రంప్ ప్లాన్లు..!
ఇరాన్‌కు ఆర్థిక వెన్నెముకగా నిలిచే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు US అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు యాక్సియోస్ కథనం పేర్కొంది. ఇందుకోసం జపాన్‌లోని ఓకినావా నుంచి పెద్ద సంఖ్యలో మెరైన్ కమాండోలను ఇప్పటికే పశ్చిమాసియాకు తరలించారట. ఈ ద్వీపం ఆక్రమణ ద్వారా ఇరాన్ చమురు ఎగుమతులను దెబ్బతీసి, ఆ దేశాన్ని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయడం US లక్ష్యం.