లారీ కింద పడి క్లీనర్ మృతి
కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ పరిధిలో లారీ కింద పడి క్లీనర్ మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. సీఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన అశోక్ అనే వ్యక్తి లారీ కింద నిద్రిస్తుండగా, ప్రమాదవశాత్తు లారీ వెనక్కి కదిలి వెనక చక్రాలు అతని తలమీదుగా వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.