మందుబాబులకు అడ్డాగా కళాశాల

మందుబాబులకు అడ్డాగా కళాశాల

SRD: సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తాగుబోతులకు అడ్డాగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం కళాశాలకు రాగానే ఖాళీ బీరు సీసాలు కనిపిస్తున్నాయని, మైదానంలో పగిలిన సీసాలు భయపెడుతున్నాయని వారు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించి, తాగుబోతుల బెడద లేకుండా చూడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.