విద్యార్థులకు దుస్తులు పంపిణీ

విద్యార్థులకు దుస్తులు పంపిణీ

ATP: నార్పల మండలం బొందలవాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెంకట్ వకుల ఫౌండేషన్ ఛైర్మన్ ఆలం వెంకట నరసానాయుడు సొంత నిధులతో దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దుస్తులు ధరించి గర్వంగా, పట్టుదలతో చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు.