'బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి'
NRPT: ఉట్కూర్ మండలం అంబేడ్కర్ కళాభవన్ లో జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. పారా లీగల్ వాలంటీర్ ఎస్.అంజమ్మ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్ట విరుద్ధమన్నారు. 18 సంవత్సరాలు పూర్తయ్యాకే వివాహం చేయాలని చట్టం పేర్కొంటుందని ఆమె అన్నారు.