వృద్ధులే లక్ష్యంగా మోసాలు.. జాగ్రత్త
SDPT: అమాయక వృద్ధ మహిళలను నమ్మించి నగదుతో పాటు 8 తులాల బంగారం కాజేసిన ఇద్దరు నిందితులను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లు కట్టుకుంటామని నమ్మించి బాధితుల వద్ద నుంచి బంగారం తీసుకుని, వాటిని విక్రయించినట్లు ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అపరిచిత వ్యక్తులను నమ్మొద్దని పోలీసులు సూచించారు.