ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు మూసివేత

MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను అధికారులు కొద్దిసేపటి క్రితం మూసివేశారు. శనివారం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో 20 గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం148 మీటర్లు కాగా ప్రస్తుతం 147.20 మీటర్లు, నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు 17.9526 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టులోకి 44,203 క్యూసెక్కుల వరద వస్తోంది.