గ్రామాల శుభ్రతకు ఈ-ఆటోలు కీలకం: ఎమ్మెల్యే
PLD: గ్రామాల శుభ్రత లక్ష్యంగా స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర మిషన్‌లో భాగంగా పల్నాడు జిల్లాలోని 8 మేజర్ పంచాయతీలకు ఈ-ఆటోల పంపిణీ కార్యక్రమాన్ని నరసరావుపేటలో ప్రారంభించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఈ కార్యక్రమంలో పాల్గొని, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరరావు నాయక్‌లతో కలిసి ఈ-ఆటోలను ప్రారంభించారు.