ఇక తప్పనిసరిగా స్కైవాక్ ఎక్కాల్సిందే

HYD: ఉప్పల్ రింగ్ రోడ్డులో ఇప్పుడు రోడ్డు దాటాలంటే తప్పనిసరిగా స్కై వాక్ ఎక్కాల్సిందే. స్కైవాక్ ఉన్నప్పటికీ అనేక మంది పాదాచారులు ప్రమాదకరంగా రోడ్డు డివైడర్ మీదుగా రోడ్డు దాటేవారు. దీనిపై అవగాహన కల్పించిన ఫలితం లేదు. ఇక ప్రమాదాలు పొంచి ఉన్నాయని గమనించిన అధికారులు, డివైడర్ పై భారీ ఎత్తున గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఇక జంప్ చేసినా రోడ్డు దాటలేం.