మూలమలుపు వద్ద పల్టీ కొట్టిన కారు.. తప్పిన పెను ప్రమాదం

మూలమలుపు వద్ద పల్టీ కొట్టిన కారు.. తప్పిన పెను ప్రమాదం

NTR: వీరులపాడు మండలం జగన్నాధపురం మూలమలుపు వద్ద శుక్రవారం ఓ కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. విజయవాడ నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న ఈ కారు, ప్రమాదకరమైన మలుపు వద్ద వేగం నియంత్రించలేక పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. కారు పల్టీలు కొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపించినా ప్రాణాపాయం తప్పిందన్నారు.