బీఎన్ రోడ్డును అభివృద్ధి చేస్తాం: ఎంపీ

అనకాపల్లి: జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. సోమవారం ఆయన చోడవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి అనుబంధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. చోడవరం నియోజకవర్గంలో బీఎన్ రోడ్డును అభివృద్ధి చేస్తామని చెప్పారు.