అక్రమ ఇసుక రవాణా చేస్తే ట్రాక్టర్లు సీజ్: సీఐ
NGKL: కొల్లాపూర్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మంగళవారం సీఐ మహేష్, ఎస్సై సురేష్ హెచ్చరించారు. ఎన్మన్ బెట్ల గ్రామంలోని రైతు వేదికలో తహసీల్దార్‌తో కలిసి ట్రాక్టర్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే భారీ జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.