'గుంటూరు - రాయగడ రైలుకు కొత్తవలసలో హాల్ట్ ఇవ్వాలి'

'గుంటూరు - రాయగడ రైలుకు కొత్తవలసలో హాల్ట్ ఇవ్వాలి'

VZM: గుంటూరు నుంచి రాయగడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ కరోనా ముందు కొత్తవలస రైల్వేస్టేషన్‌లో ఆగేది. ఆ తర్వాత అనివార్య కారణాలతో నిలిపివేశారు. అప్పటినుంచి నేటివరకు పునరుద్ధరణ చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రైలు అతి చిన్నస్టేషన్ అయిన సీతానగరంలో ఆగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎంపీ భరత్ రైల్వేశాఖ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవట్లేదని తెలిపారు.