ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: తహసిల్దార్

KNL: తహశీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను తహశీల్దార్ శ్రీధర్ మూర్తికి అర్జీల రూపంలో అందించారు. పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.