సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి
కృష్ణా: మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు వారికి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.