విధుల్లో నిర్లక్ష్యం.. అధికారికి షోకాజ్ నోటీసు
పల్నాడు జిల్లా పౌరసరఫరాల మేనేజర్ నారదమునికి ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతంలో ఎన్నికల విధుల్లో 1,219 మంది సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లకు బదులు, నిబంధనలకు విరుద్ధంగా టెండర్ బ్యాలెట్ పేపర్లు జారీ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై విచారణ చేపట్టిన సర్కారు, విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైనందుకు తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.