VIDEO: ప్రమాదకరంగా మారిన కట్టలేరు వాగు
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప–తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగు ప్రజలకు ప్రమాదంగా మారింది. వాగు మీద వంతెన లేకపోవడంతో వాహనదారులు ప్రాణాలను పణంగా పెట్టి దాటుతున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా, 30 కిలోమీటర్ల దూరం మళ్లీ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో ప్రజలు తప్పనిసరిగా వాగుపైనే ప్రయాణం చేస్తున్నారు.