కోతుల దాడిలో గాయపడ్డ సొసైటీ వైస్ ఛైర్మెన్

KMR :పెద్ద కొడఫ్గల్ మండలం కాటేపల్లిలో కోతుల బెడద తీవ్రమైంది. శుక్రవారం వాకింగ్ వెళ్తున్న సొసైటీ వైస్ ఛైర్మన్ గంగా గౌడ్ పై కోతులు దాడి చేసి గాయపరిచాయి. ఈ సంఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న జీపి కార్యదర్శి భూపల్లి ప్రదీప్, ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ డాక్టర్ సాయిబాబా, వైస్ ఛైర్మన్లు గంగా గౌడ్ ను పరామర్శించారు.