VIDEO: 'వట్టివాగు ప్రాజెక్టుకు కాలువలను మంజూరు చేయాలి'
ASF: ఆసిఫాబాద్ మండలం వట్టివాగు వద్ద నిర్మించిన ప్రాజెక్టుకు ప్రధాన కాలువలు, పిల్ల కాలువలు లేవని MLA కోవ లక్ష్మి గురువారం అసెంబ్లీలో పేర్కొన్నారు. కాలువలు లేకపోవడంతో ఉపాధి హామీ ద్వారా పూడికతీత చేయాల్సి వస్తుందన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అన్న ప్రాజెక్టుకు కాలువలను మంజూరు చేయాలని, గతంలో ఉన్న కాలువలను మరమ్మతులు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.