అత్యంత పిన్నవయసు చెస్‌ ప్లేయర్‌గా సర్వజ్ఞ

అత్యంత పిన్నవయసు చెస్‌ ప్లేయర్‌గా సర్వజ్ఞ

ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసు చెస్ ప్లేయర్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన సర్వజ్ఞ సింగ్ నిలిచాడు. 3 సంవత్సరాల 7 నెలల, 20 రోజుల వయసున్న సర్వజ్ఞ.. ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం అత్యంత పిన్నవయసు చెస్ ప్లేయర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. మొత్తం ఫిడే ర్యాంకింగ్స్‌లో 1,572 స్థానంలో ఉన్నాడు.