కష్టాల కడలిలో రైతన్నలు...

కష్టాల కడలిలో రైతన్నలు...

KNR: హుజురాబాద్ మండలంలోని రైతులు ఇవాళ కురిసిన అకాల వర్షంతో మరోసారి తీవ్రంగా నష్టపోయారు. ఉ.8 నుంచి 10 గంటల వరకు ఐదు సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో చేతికొవచ్చిన పంట నేలవాలింది. వడ్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. దీంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. కల్లాల వద్ద పోసిన ధాన్యం కుప్పలు తడిసి ముద్దగా ప్రవాహంలో కొట్టుకుపోతుండగా, రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు.