VIDEO: పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత

VIDEO: పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత

వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, తాడిపర్తి మాజీ సర్పంచ్ గుండ్రాతి గణేష్ గౌడ్ తన పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనపై కక్ష సాధింపులు చేసినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొన్నానని అన్నారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులు తనపై కక్ష సాధింపు చేయడాన్ని జీర్ణించుకోలేక రాజీనామా చేస్తున్నానని చెప్పారు.