గచ్చిబౌలిలో పర్యటించిన ఎమ్మెల్యే గాంధీ
RR: శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆదివారం గచ్చిబౌలి డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్ పరిధిలోని నానక్‌రాం గూడ సుమధుర ఆక్రో పాలీస్ అపార్ట్‌మెంట్స్‌లో రూ.1.30 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన 295కేవీ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడంపై కాలనీవాసులను అభినందించారు.