వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు

వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు

MNCL: మందమర్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నాడు. మానవ శరీర భాగాలు ముద్రించి ఉన్న ఓ చొక్కాను వేసుకొని వచ్చి విద్యార్థులను ఆశ్చర్యపరిచాడు. మానవ శరీర అవయవాలు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, వాటి పనితీరును కళ్లకు కట్టినట్లు చూపిస్తూ బోధించడంతో విద్యార్థులు ఆసక్తిగా విన్నారు.