ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు

ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులు

MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని మండల ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. మండలంలో మొత్తం 31 గ్రామపంచాయతీలు ఉన్నాయని, డిసెంబర్ 11న ఆయా గ్రామాలలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి బ్యాలెట్ బాక్సులు పత్రాలు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నాయని ఆయన వెల్లడించారు.