నేడు భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవం

WGL: వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు శుక్రవారం వైశాఖ శుద్ధ పంచమి తిధి భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం ( శివ కళ్యాణం) జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. భక్తులందరూ కళ్యాణ వేడుకను వీక్షించాలని కోరారు.