VIDEO: రైతుల త్యాగాల వల్లే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
AKP: నక్కపల్లి చెందిన రైతులు త్యాగం చేయడం వల్లే ఇక్కడ ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కూటమిపై ఉన్న నమ్మకంతో రైతులు భూములు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి రైతుకు పాదాభివందనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాయకరావుపేటను పారిశ్రామిక రంగానికి గేట్ వేగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.