'పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలి'

PDPL: పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని, పెద్దపెల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య అన్నారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య బుధవారం పర్యటించారు. గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డులను తనిఖీ చేశారు. పారిశుధ్యం విషయంలో పకడ్బందీగా ఉండాలన్నారు.