కుమారుడి పెళ్లికి కర్ణాటక మంత్రులకు ఆహ్వానం
KMM: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ శుభకార్యానికి కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులను సాదరంగా ఆహ్వానించారు. మార్చి 5న హైదరాబాద్‌లో ఘనంగా జరగనున్న ఈ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆయన బెంగళూరులో మంత్రులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.