'మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందించాలి'
ASR: జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ కోరారు. ఈమేరకు బుధవారం పాడేరులో పార్టీ నాయకులతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు వైద్యులను నియమించాలని, పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని వారిని కోరారు.