మానవ ఇన్సులిన్‌ ఇకపై మరింత చౌక..!

మానవ ఇన్సులిన్‌ ఇకపై మరింత చౌక..!

మానవ ఇన్సులిన్‌ను చౌకగా తయారుచేసే కొత్త పద్ధతిని ఐఐటీ గువాహటి పరిశోధకులు కనుగొన్నారు. 'సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్' అనే బ్యాక్టీరియాను ఉపయోగించి ఈ పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ ప్రక్రియ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న పద్ధతిలో ఖర్చు ఎక్కువ, ఉత్పాదకత తక్కువ. కాగా, ఈ కొత్త విధానానికి ఇప్పటికే రెండు భారతీయ పేటెంట్లు కూడా లభించాయి.