BREAKING: కేంద్రం.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
మీర్జాగూడ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా, ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించారు. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.