రేపు సోమశిలలో మంత్రి ఆనం పర్యటన

NLR: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం అనంతసాగరం మండలంలో పర్యటించనున్నారు.ఉదయం 9.00 గంటలకు సోమశిలలో వెలసియున్న సుప్రసిద్ధ సంగమేశ్వరస్వామి దేవస్థాన పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం సోమశిల జలాశయం నుండి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.