అత్యవసర ఆపరేషన్‌కు LOC అందించిన ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండల కన్నాపూర్ గ్రామానికి చెందిన సత్యవ్వ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చూపించుకోగా, ఆపరేషన్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సత్యవ్వ కుటుంబసభ్యులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే ప్రభుత్వం తరపు నుంచి చికిత్స నిమిత్తం రూ. 2,50,000 శుక్రవారం బాధితులకు అందించారు.