పోలింగ్ సెంటర్ వద్ద రణరంగం.. కొట్టుకున్న కాంగ్రెస్, టీఆర్పీ..!
SRPT: సూర్యపేట 13వ వార్డులో ఎన్నికల వేళ ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. కాంగ్రెస్, టీఆర్పీ వర్గాలు పోలింగ్ కేంద్రం సాక్షిగా వీరంగం సృష్టించాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దెబ్బకు ఆందోళనకారులు చెల్లాచెదురుకాగా, పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.