పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు తెస్తాం: దుర్గేష్
AP: రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ యవనికపై నిలబెడతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సుస్థిర వృద్ధి, డిజిటలైజేషన్ లక్ష్యంగా నవంబర్ 4-6 వరకు లండన్‌లోని వరల్డ్ ట్రావెల్ మార్కెట్ సమావేశంలో పాల్గొంటామని అన్నారు. రాష్ట్ర సహజ సిద్ధ ప్రదేశాలు, వారసత్వ సంపదను ప్రచారం చేసి.. కూచిపూడి నృత్యంతో స్వాగతం పలికి, అరకు కాఫీ, పూతరేకుల రుచి చూపిస్తామని పేర్కొన్నారు.