ట్రంప్‌కు గల్ఫ్ దేశాల రహస్య విన్నపం
ఇరాన్‌లో ప్రస్తుత ఇస్లామిక్ పాలనను పూర్తిగా అంతం చేయాలని గల్ఫ్ దేశాలు పట్టుబడుతున్నాయి. సౌదీ అరేబియా, UAE, కువైట్ వంటి దేశాలు US అధ్యక్షుడు ట్రంప్‌ను రహస్యంగా కలిసి.. ఇరాన్‌పై యుద్ధాన్ని కొనసాగించాలని కోరినట్లు 'అసోసియేటెడ్ ప్రెస్' వెల్లడించింది. ఇరాన్ పూర్తిగా బలహీనపడలేదని, ఆ దేశ ప్రభావాన్ని తుడిచిపెట్టే వరకు తగ్గవద్దని ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నాయట.