20న సాంస్కృతిక వైభవం

20న సాంస్కృతిక వైభవం

విజయనగరంలో సాంస్కృతిక సందడి నెలకొంది. ఈనెల 20న సీతం కళాశాలలో ‘సాంస్కృతిక వైభవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురు ప్రసాద్ తెలిపారు. తెలుగు భాషా పరిరక్షణ సమితితో కలిసి దీనిని చేపట్టారు. సత్య కళాశాల డైరెక్టర్ డా.మజ్జి శశిభూషణ్ రావుతో కలిసి తోటపాలెంలో ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు.