పామూరులో డ్రోన్ ద్వారా ప్రత్యేక నిఘా

ప్రకాశం: పామూరులో పోలీస్ అధికారులు గురువారం డ్రోన్ కెమెరా ద్వారా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ను వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.