విశాఖలో ప్రముఖ హోటళ్లపై ఐటీ దాడులు

విశాఖలో ప్రముఖ హోటళ్లపై ఐటీ దాడులు

VSP: నగరంలోని ప్రముఖ హోటళ్లపై ఆదివారం ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. పెందుర్తి, మర్రిపాలెం, మధురవాడ, అక్కయ్యపాలెం ప్రాంతాల్లోని నాలుగు చోట్ల తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా సెలెబ్రేషన్స్ రెస్టారెంట్‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.