ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
SRCL: తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో రూ. 43 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులు నరసయ్య, పరశురాములుకు కాంగ్రెస్ నాయకులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. పేదలకు సీఎంఆర్ఎఫ్ వరంల ఉపయోగపడుతుందన్నారు. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందని వివరించారు.