ఎండల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న ఎస్పీ
SKLM: టెక్కలి (M) రావివలసలో ఉన్న శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామివారిని ఆదివారం సాయంత్రం జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎస్పీని వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. మూడో సోమవారం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.