ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన సీజేఐ జస్టిస్ గవాయి
SS: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ శనివారం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఆయనకు స్వాగతం పలికారు. జస్టిస్ గవాయ్ సత్యసాయి బాబా మహా సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణాన్నా ఆయన ఆస్వాదించారు.