సిరిపురంలో రైతన్న మీ కోసం కార్యక్రమం

సిరిపురంలో రైతన్న మీ కోసం కార్యక్రమం

VZM: గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో సీఎం చంద్రబాబు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మంగళవారం 'అన్నదాత సుఖీభవ - రైతన్న మీ కోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఆకిరి మురళి, నీటి సంఘం అధ్యక్షురాలు గుండపు సింధు, అగ్రికల్చర్ అసిస్టెంట్ చంద్రకళ, వీఆర్ఓ స్వాతి, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.