ఈ ఏడాదే మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం: గొట్టిపాటి
AP: పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో MP లావు శ్రీకష్ణదేవరాయలు, MLA శ్రీనివాసరావు పాల్గొన్నారు. మే 15 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న OP బ్లాక్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఈ ఏడాదే ప్రారంభిస్తామని చెప్పారు.