కడప జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా సూర్య నారాయణ

KDP: కడప జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌గా సూర్య నారాయణ రెడ్డిని నియమిస్తూ కూటమి ప్రభుత్వం జాబితాను విడుదల చేసింది. సోమవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిధిలోని డీసీసీబీ బ్యాంకుల ద్వారా రైతులకు నిరంతర సహకారం అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.