జాతీయ లోక్ అదాలత్ లో 120 కేసులు రాజీ

SKLM: కొత్తూరు కోర్టులో జాతీయ లోక్ అదాలత్ శనివారం జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ కందుకట్ల రాణి నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతిష్టలకు పోయి తగాదాలు పడే కంటే కేసులలో రాజీ కావడమే ఉత్తమం అని ఆమె అన్నారు. కొత్తూరు, హిరమండలం, బత్తిలి పోలీస్ స్టేషన్లు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 120 కేసులు రాజీ జరిగినట్లు జడ్జి రాణి వెల్లడించారు.